తిరుపతిలో బాలిక అదృశ్యం కేసు
తిరుపతి: తిరుపతిలో ఒక బాలిక అదృశ్యమైంది. రాధిక అనే ఈ బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల్లో ఇది మూడో అదృశ్యం కేసు. తాజాగా అదృశ్యమైన బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టింది. బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా, బాలిక తప్పిపోయిందా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
కూలీపని చేసుకుని బతకడానికి వచ్చిన భార్యాభర్తలు సోమవారం సాయంత్రం బాలికను ఇంటి వద్ద వదిలి ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి పచ్చే సరికి కూతురు కనిపించలేదు. దీంతో వారు కూతురు కోసం రాత్రంతా గాలించి ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు బస్ స్టాండు నుంచి అదృశ్యమైన రెడ్డి ప్రసాద్ అనే బాలుడి ఆచూకీ ఇంత వరకు తెలియలేదు. తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వద్దనే ఉండి కొడుకుకోసం ఎదురుచూస్తున్నారు.
తిరుపతిలోని గిరిపురం కాలనీ నుంచి సోమవారం సాయంత్రం అదృశ్యమైన రాధిక అనే పదేళ్ల బాలిక ఖాదీనగరులో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications
