మండలి నుంచి టిడిపి, తెరాస సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులను ఒక రోజుపాటు శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి మంగళవారం సస్పెండ్ చేశారు. రిలయన్స్ ఫ్రెష్ లపై తెరాస సభ్యులు, వరికి మద్దతు ధరపై తెలుగుదేశం సభ్యులు చర్చకు పట్టుబట్టారు. చర్చకు మండలి చైర్మన్ అంగీకరించలేదు. అయినా వారు వినలేదు.
చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి తెలుగుదేశం, తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చైర్మన్ ఎంతగా సర్ది చెప్పినా వారు వినలేదు. మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చైర్మన్ చెప్పినా వారు వినలేదు. దీంతో వారిని ఒక రోజు పాటు సభనుంచి సస్పెండ్ చేస్తూ చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
