వరికి మద్దతు ధరపై ప్రతిపక్షాల పాదయాత్ర


హైదరాబాద్: వరికి మద్దతు ధరపై ప్రతిపక్షాల సభ్యులు మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఇందిరా పార్కు నుంచి శాసనసభ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం వారు శాసనసభలో ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ పాదయాత్రలో వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి నాయకులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. వరికి మద్దతు ధరపై తలపెట్టిన బంద్ కు వారు మద్దతు తెలియజేశారు.

వరికి మద్దతు ధరపై ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం శాసనసభ్యులు సోమవారం రాత్రి శాసనసభ ఆవరణలోనే నిద్రించారు. వరికి మద్దతు ధరపై శాసనసభలో జరిగిన చర్చకు సోమవారంనాడు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారు అంతకు ముందు స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. ఈ స్థితిలోనే స్పీకర్ సభా కార్యక్రమాలను కొనసాగించి వెళ్లిపోయారు. అనంతరం వారు సభ లోపల నుంచి వెలుపలకి వచ్చి ధర్నా చేశారు. చంద్రబాబునాయుడితో సహా తెలుగుదేశం సభ్యులు రాత్రి శాసనసభలోనే నిద్రించి మంగళవారం స్నానాలు వగైరా ముగించి సమావేశాలకు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+