తెలంగాణ బిల్లుకు ఒత్తిడి తెస్తాం: రాజ్ నాథ్ సింగ్
ఏలూరు/ రాజమండ్రి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. కర్ణాటకలో ఎన్నికలు పెడితే తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. బిజెపి రైతు పోరుబాటలో భాగంగా ఆయన మంగళవారం ఉభయ గోదావరి జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. రాజమండ్రిలో రైతు పోరుబాటను ఆయన ప్రారంభించారు. అనంతరం రావులపాలెంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రైతులకు పంట రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చి లక్ష, లక్షన్నర రూపాయల రుణాలను మాఫీ చేయడానికి వెనకాడుతోందని ఆయన అన్నారు. రైతులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వరి, కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
