27న సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బెయిల్ పిటిషనుపై సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీన విచారణ చేపట్టనుంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఆయనకు ఆరేళ్ల కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. సంజయ్ దత్ తో పాటు దోషులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై వచ్చే మంగళవారం విచారణ చేపడుతామని, బెయిల్ మంజూరు చేసే విషయంలో అందరికీ ఒకే ప్రమాణాలను పాటిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రమాణం పరిధిలోకి వచ్చే అందరికీ బెయిల్ ఇచ్చే విషయంలో ఉమ్మడి ఆదేశం జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది. వివిధ దోషులకు పడిన శిక్షల వివరాలు అందించాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది.











Click it and Unblock the Notifications
