స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి
హైదరాబాద్: వరికి మద్దతు ధరపై తెలుగుదేశం పార్టీ ఆందోళన నేపథ్యంలోనే స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి మంగళవారం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. వరికి మద్దతు ధరపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఎంతగా చెప్పినా వినకపోవడంతో స్పీకర్ సభను మొదట 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగి నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్యలోనే తీర్మానంపై స్పీకర్ ఓటింగు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం సభ్యులకు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దాంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
