నాపై దేవెగౌడ చేతబడులు: యాడ్యూరప్ప


Yediyurappaబెంగుళూర్: తనను చంపడానికి జనతాదళ్ - సెక్యులర్ (జెడి-ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ చేతబడులు చేయిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోపించారు. దేవెగౌడపై ఆయన మంగళవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. తనను చంపడానికి దేవెగౌడ మంత్రతంత్రాలు ప్రయోగిస్తున్నారని, వాటినుంచి తాను చాలా సార్లు తప్పించుకున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను చెప్పినదాన్ని అపార్థం చేసుకోవద్దని, తాను నిజమే చెబుతున్నానని ఆయన అన్నారు.

జెడి-ఎస్ నేతల నమ్మకద్రోహం వల్లనే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆయన విమర్శించారు. వారు రాజ్యాంగాన్ని అవమాన పరిచారని, సుప్రీంకోర్టు తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. గవర్నర్, రాష్ట్రపతులను కూడా వారు నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు. వారంత వారు వచ్చి మద్దతిస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభ రద్దుకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల తీర్పును కోరడానికే తాను ప్రాధాన్యం ఇస్తున్నానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+