తల్లిపై దాడి చేసి కూతురిని ఎత్తుకెళ్లిన ప్రేమోన్మాది
అనంతపురం: తాను ప్రేమించిన 16 ఏళ్ల బాలికను ఆమె తల్లిపై దాడి చేసి ఒక ప్రేమోది ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. ప్రేమ పేరుతో రవి అనే యువకుడు లక్ష్మీదేవి అనే 16 ఏళ్ల బాలికను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఎత్తుకుపోతానని కూడా బెదిరించాడు.
అకస్మాత్తుగా రవి బుధవారం ఉదయం తాడిపత్రిలోని ఇందిరానగర్ లో గల ఇంటికి వచ్చి తల్లిపై దాడి చేసి లక్షీదేవిని ఎత్తుకెళ్లాడు. లక్ష్మీదేవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications