ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నా: ఆర్తీ అగర్వాల్
హైదరాబాద్: తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని ఎన్నారై ఉజ్వల్ కుమార్ ను సికింద్రాబాదు రాణిగంజ్ లో గల ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సినీనటి ఆర్తీ అగర్వాల్ చెప్పారు. తాను, ఉజ్వల్ కుమార్ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నామని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఉజ్వల్ కుమార్ తమ దూరపు బంధువు అని ఆమె చెప్పారు. ఆర్తీ అగర్వాల్ పెళ్లి వార్తను సేకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆర్తీ అగర్వాల్ తండ్రి శశాంక్ అగర్వాల్ దాడి చేశారు. అందుకు నిరసనగా జర్నలిస్టులు ఆర్యసమాజ్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో వారికి ఆయన క్షమాపణ చెప్పారు.
సమయం లేకపోవడం వల్లనే పెళ్లికి ఎవరినీ పిలువలేదని ఆర్తీ అగర్వాల్ కుటుంబసభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆర్తీ అగర్వాల్ నటిస్తున్న గోరింటాకు సినిమా యూనిటుకు కూడా ఈ పెళ్లి విషయం తెలియదు. పెళ్లి తర్వాత ఈ సినిమాను పూర్తి చేయడమే కాకుండా ఇక ముందు కూడా సినిమాల్లో ఆమె నటించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications