యుపిలో వరుస పేలుళ్లు: 25 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల శుక్రవారం మధ్యాహ్నం వరుసగా బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 25 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నో, వారణాసి, ఫైజాబాదులలోని కోర్టు ఆవరణల్లో ఈ బాంబులు పేలాయి. లక్నోలో ఆరుగురు, వారణాసితో ఏడుగురు మరణించినట్లు భావిస్తున్నారు. ఫైజాబాదులో 12 మంది మరణించారు. వీరిలో ముగ్గురు న్యాయవాదులున్నారు. ఈ పేలుళ్లలో పలువురు గాయపడ్డారు. ఫైజాబాదులో మరో పేలని బాంబు కూడా లభ్యమైంది. ఈ పేలుళ్లన్ని ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
సైకిళ్లపై బాంబులు అమర్చి పేల్చివేశారు. ఇది ఉగ్రవాదుల పనేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాహుల్ గాంధీ కుట్రను పోలీసులు విఫలం చేసిన నేపధ్యంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఫైజాబాదు కోర్టులో ఒకటికన్నా ఎక్కువ పేలుళ్లు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పేలని బాంబులు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్ల నేపధ్యంలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాదుల్లో హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications
