పేలుళ్లు మా పనే: ఇండియన్ ముజాహిదీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బాంబు పేలుళ్లు తమ పనేనని ఇండియన్ ముజాహిదీన్ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు మీడియా కార్యాలయాలకు ఇ- మెయిల్స్ వచ్చినట్లు ప్రైవేట్ టీవీ చానెల్స్ వార్తను ప్రసారం చేశాయి. ఫ్రెంచ్ ఐడితో ఈ మెయిల్స్ వచ్చినట్లు ఆ వార్తా కథనం పేర్కొంది. పోలీసులను లక్ష్యంగా ఎంచుకుని బాంబులు పేల్చినట్లు ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.
వారణాసి, లక్నో, ఫైజాబాదుల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 8 మంది మాత్రమే చనిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. లక్నో పేలుడులో ఎవరూ చనిపోలేదని చెబుతున్నారు. అయితే మృతులు 25 మంది దాకా ఉంటారని అనధికారవర్గాల అంచనా. న్యాయవాదుల దాడికి ప్రతీకారంగానే ఈ పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పేలుళ్ల నేపధ్యంలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాదుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications
