అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాగ్ తప్పులు: రోశయ్య
హైదరాబాద్: నీటి పారుదల శాఖ అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ నిర్లక్ష్యం వల్లనే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) నివేదిక తప్పు పట్టిందని ఆర్థిక శాఖ మంత్రి కె. రోశయ్య చెప్పారు. వివరాలను సరిగా అందించకపోవడం వల్లనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాని కాగ్ నివేదిక తప్పు పట్టిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయంలో విచారణ సాగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
అన్ని శాఖల్లో అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామని, పొరపాట్లు జరిగాయని తేలితే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లోపాలకు కారణమైనవారు ఎవరైనా సరే చర్యలు తప్పవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
