ఉపదేశం లేకుండా సత్యసాయి జన్మదిన వేడుకలు
అనంతపురం: పుట్టపర్తి సాయిబాబా 82వ జన్మ దినవేడుకలు ప్రశాంతి నిలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. అయితే విశేషంగా తరలివచ్చిన భక్త జనం సత్యసాయిబాబా ప్రసంగం లేకపోవడం కాస్తా నిరాశకు గురి చేసింది. కానీ దర్శనం ఎక్కువ సేపు కావడంతో వారు సంతృప్తి చెందారు. సంప్రదాయం ప్రకారం ప్రతి జన్మ దినానికి కేక్ కట్ చేసిన అనంతరం సత్యసాయిబాబా ఉపదేశం ఇస్తారు. అయితే ఈసారి కేక్ కట్ చేసిన అనంతరం ఆయన ఉపదేశం ఇవ్వలేదు.
అంతేకాకుండా జన్మదిన వేడుకలు రోజు తెల్ల వస్త్లాలతో ఆయన దర్శనమివ్వడం పరిపాటి. కాని ఈసారి కాషాయ వస్త్రాల్లోనే భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం జరిగిన డీమ్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి మాత్రం తెల్లవస్త్రాలతో ఆయన హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
