హైదరాబాదులో తనిఖీలు ముమ్మరం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ వరుస పేలుళ్ల నేపధ్యంలో హైదరాబాదులో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాదులో శుక్రవారం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో గస్తీని పటిష్టం చేశారు.
అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు పోలీసులకు సూచించింది. అనుమానాస్పదమైన వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఉత్తరప్రదేశ్ పేలుళ్లకు నిరసనగా వరంగల్ లో న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు.












Click it and Unblock the Notifications
