తెలంగాణపై నోరు విప్పొద్దు: మొయిలీ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణపై ఎవరూ మాట్లాడకూడదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ పార్టీ రాష్ట్ర నాయకులను ఆదేశించారు. తెలంగాణపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డు పడుతున్నారనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపికి పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, అధ్యక్షుడి పేరును డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. గురువారంనాడు హైదరాబాద్ వచ్చిన వీరప్ప మొయిలీ రాష్ట్ర నాయకులతో మాట్లాడుతున్నారు. తెలంగాణపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు ఆయనతో చెప్పారు.












Click it and Unblock the Notifications
