హైదరాబాదులో యువతి కిడ్నాప్
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డకు చెందిన స్వప్న అనే యువతి శుక్రవారం ఉదయం అపహరణకు గురైంది. ఈ విషయాన్ని స్వప్న తండ్రి లక్ష్మీనారాయణ ననత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటోలో వచ్చిన దుండగులు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో వాకిరి ఊడుస్తున్న స్వప్నను ఎత్తుకెళ్లారు. ఆటో డ్రైవర్ పై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లను పోలీసులు స్టేషనుకు పిలిపించి విచారణ జరుపుతున్నారు.
మూడు రోజులు క్రితం అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక ఆటో డ్రైవరును స్వప్న కొట్టింది. అప్పటి నుంచి ఆటో డ్రైవరు ఆ యువతిని అనుసరిస్తూ వస్తున్నాడు. దీంతో ఆ డ్రైవరే తమ కూతూరిని కిడ్నాప్ చేసి ఉంటాడని లక్ష్మినారాయణ అనుమానిస్తున్నాడు. క్లినిక్ వద్ద ఆటో ఎక్కిన స్వప్న పట్ల ఆటో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెప్పుతో అతన్ని కొట్టి ఆటో దిగిపోయి మరో ఆటో ఎక్కి ఇంటికి వెళ్లిపోయింది. దాంతో ఆటో డ్రైవరు స్వప్నపై కోపం పెంచుకున్నాడని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
