జైపూర్ లోనూ హెచ్చరికలు: ఢిల్లీకి తస్లీమా
జైపూర్: బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ జైపూర్ నగరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. భద్రతకు సంబంధించి సమస్య దృష్ట్యా ఆమె ఢిల్లీకి బయలుదేరారు. ఆమెతో పాటు ఫైజల్ అనే వ్యక్తి, రాజస్థాన్ పోలీసులు ఉన్నారు. తస్లీమా నస్రీన్ ను ఎక్కువ కాలం నగరంలో ఉండనిస్తే ప్రదర్శన చేస్తామని ముస్లిం సంస్థ అఖిల భారత మిల్లీ కౌన్సిల్ హెచ్చరించిన నేపధ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఏ మతాన్నైనా దూషించడమనేది స్వేచ్ఛకు అర్థం కాదని మిల్లి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంజినీర్ మహ్మద్ సలీం అన్నారు. గురువారం రాత్రి తస్లీమా సిఖా హోటల్ లో 30 మంది పోలీసుల భద్రతతో బస చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల విజ్ఞప్తి మేరకు తస్లీమాకు వై కెటగిరీ భద్రత కల్పించామని రాజస్థాన్ ఇన్స్ పెక్టర్ జనరల్ (భద్రత) మేఘచంద్ మీనా చెప్పారు. కోల్ కత్తా నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారిన నేపధ్యంలో తస్లీమాను జైపూర్ తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications
