విద్యార్ధినిపై అత్యాచారం జరిపిన టీచర్ సస్పెన్షన్
సంగారెడ్డి: మెదక్ జిల్లా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన హెడ్ మాస్టర్ సైమన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విద్యార్థినిని అతను మూడు రోజులు నిర్బంధించి ప్రధానోపాధ్యాయుడు సైమన్ అత్యాచారం చేశాడు. ఈ మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో జిల్లా సూపరింటిండెంట్ ఆర్.పి. నాయక్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎస్పీకి చేసిన ఫిర్యాదు ప్రకారం - సైమన్ బాలికను గత నాలుగు నెలలుగా బెదిరిస్తున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. చివరికి ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు సైమన్ బాలికను తన సోదరి ఇంట్లో నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. అయితే చివరకు పెళ్లికి నిరాకరించి, ఎంతో కొంత ముట్టజెప్పి వదిలించుకునే ప్రయత్నం చేశాడు.












Click it and Unblock the Notifications
