మా సభలకు వచ్చినవారిని చంపారు: బాబు
హైదరాబాద్: తమ సమావేశానికి వచ్చేవారికి హెచ్చరిక చేయడానికి కడప జిల్లా పులివెందులలో ఇద్దరిని చంపేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. విజయవాడలో జరిగిన రైతు గర్జన సదస్సుకు భారీగా రైతులు తరలివచ్చారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతు గర్జనను విఫలం చేయడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. రైతు గర్జనకు తగిన పోలీసు భద్రతా ఏర్పాట్లను కూడా సరిగా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు.
రైతుల పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. తొమ్మిది జిల్లాల్లో ఏరువాక నిర్వహించామని ఆయన చెప్పారు. జాతీయ విధానం ప్రకటించినప్పుడు కూడా స్వామినాథన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర కోసం తాము శాసనసభలో పోరాటం చేశామని, ప్రధాని అపాయింట్ మెంట్ కోసం వేచి చూశామని ఆయన చెప్పారు. ఆర్థిక సంస్కరణ ఫలితాలు పేదలకు అందడం లేదని, సంపద కొంతమందికి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
