కిడ్నాపులపై మీడియాదే అతి: డిజిపి
వరంగల్: రాష్ట్రంలో కిడ్నాపులు పెరగలేదని, మీడియా వల్ల పెద్దగా కనిపిస్తున్నాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఎస్.పి. యాదవ్ అన్నారు. కిడ్నాపుల సమస్య ఈనాటిది కాదని, తాతల కాలం నాటి నుంచి ఉందని సోమవారం ఇక్కడ అన్నారు. కిడ్నాపుల సంఖ్య పెరగలేదని, మీడియా పెద్దగా చూసి చూపడం వల్ల అలా అనిపిస్తోందని ఆయన అన్నారు.
హైదరాబాదులో కిడ్నాపులు పెరగడంపై మీరేమంటారని ఒక విలేకరి ప్రశ్నించగా సైబరాబాదు కమీషనరుతో మాట్లాడానని, కిడ్నాపుల సంఖ్య ఏమీ పెరగలేదని ఆయన జవాబిచ్చారు. పోలీసులు పేదలను తమవారిగా భావిస్తారని ఆయన అన్నారు. సమస్యలను ఫోన్ ద్వారా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. బాంబు పేలుళ్ల సంఘటనలో ఇంటలిజెన్స్ వైఫల్యం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
