చంద్రబాబుది అధికార దాహం: జిఎస్ రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విజయవాడలో నిర్వహించింది రైతు గర్జన కాదని, అది రాజకీయ గర్జన అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు వ్యాఖ్యానించారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికార దాహం బయటపడిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతు గర్జనలో తృతీయ ప్రత్యామ్నాయ కూటమి నాయకులు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు. రైతుల గురించి ఎవరూ మాట్లాడలేదని, అందరూ రాజకీయాలే మాట్లాడారని ఆయన అన్నారు.
ప్రభుత్వం కళ్లు తెరవాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అనడాన్ని తప్పు పట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పెట్టడానికే రాఘవులు ఆ ప్రకటన చేశారని ఆయన అన్నారు. సిపియం తెలుదేశం పార్టీలు దగ్గరవుతున్నాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
