నిజాంపై ప్రశంసలకు కెసిఆర్ సమర్థింపు
హైదరాబాద్: తాను నిజాం పాలనను ప్రశంసించడంలో తప్పేమీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమర్థించుకున్నారు. చివరి నైజాం ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఒక ఏడాది పాటు సాగిన రజాకార్ల దురాగతాలను చూపి నిజాంను దయ్యబడుతున్నారని ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
గాంధీని, నెహ్రూను, ప్రకాశం పంతులును, నీలం సంజీవరెడ్డిని అరెస్టు చేసి జైళ్లో పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి పేర బకింగ్ హామ్ కెనాల్ ఉందని, ఆనకట్ట నిర్మించినందుకు సర్ ఆర్థర్ కాటన్ ను ప్రశంసిస్తున్నారని, ఎన్నో మంచి పనులు చేసిన నిజాంను ప్రశంసించడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
