కోర్టులో ఎమ్మెల్యే చెంగల లొంగుబాటు
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట తెలుగుదేశం శాసనసభ్యుడు చెంగల వెంకటరావు సోమవారంనాడు యలమంచిలి కోర్టులో లొంగిపోయారు. బంగారంపేటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. చెంగల వెంకటరావు రెచ్చగొట్టడం వల్లనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మరణించాడనే ఆరోపణతో కేసు నమోదైంది.
చెంగల వెంకటరావుపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు నాన్ బెయిలబుల్ కేసులు. కేసులు నమోదైన వెంటనే చెంగల వెంకటరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 37 రోజుల అజ్ఞాతంలో రెండు రోజులు శాసనసభకు హాజరు కావడానికి ఆయన కోర్టు నుంచి అనుమతి లభించింది.












Click it and Unblock the Notifications
