అస్సాం బంద్ ప్రారంభం: యువకుడి హత్య
గౌహతి: అస్సాంలో ఆల్ అస్సాం ఆదివాసి స్టూడెంట్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు 36 గంటల బంద్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఈ బంద్ ప్రారంభమైన వెంటనే అక్కడక్కడా కొన్నిఅవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొక్రాజర్ జిల్లాలో 17 సంవత్సరాల సంతోష్ ప్రసాద్‌ను దుండగులు సోమవారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు రప్పించి చంపారని అధికార వర్గాలు తెలిపాయి.
యువకుడి హత్య జరిగిన అర్ధగంటలోపు అదే ప్రాంతంలోనే ఓ బ్రిడ్జి వద్ద ఒక ప్రైవేటు వాహనానికి నిప్పంటించారు. కోక్రాజర్ పట్టణంలో వాహనాల రాకపోకలను నియంత్రించారు. జాతీయ రహదారిపై మాత్రం దూర ప్రాంత బస్సులు, ఇతర వాహనాలను పోలీసు భద్రత మధ్య నడిపిస్తున్నారు. గౌహతిలో శనివారం ఆదివాసీ నిరసనకారులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోగా, మూడు వందల మందికి పైగా గాయపడటంతో ఆల్ అస్సాం ఆదివాసి స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. అయితే గౌహతిలో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా లేదు.












Click it and Unblock the Notifications
