స్వప్న కేసులో పోలీసుల నిర్లక్ష్యం: పిజెఆర్
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల బంజారా కాలనీ నుంచి అపహరణకు గురైన స్వప్న కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి విమర్శించారు. స్వప్న బంధువులతో ఆయన సోమవారంనాడు హోంమంత్రి కె. జానారెడ్డిని కలిశారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల కేసులపైన మాత్రమే పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తున్నారని, సామాన్యుల గోడును పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంపై గతంలో తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
స్వప్న ఆచూకీని వెంటనే కనుక్కోవాలని ఆమె బంధువులు జానారెడ్డిని కోరారు. స్వప్న ఆచూకీని వెంటనే కనుక్కోవాలని వారు జానారెడ్డిని కోరారు. స్వప్న ఆచూకీని సాధ్యమైనంత త్వరగా కనుక్కుంటామని ఆయన హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
