స్వప్న ఆచూకీ చెప్తే రూ. 50 వేలు
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో మూడు రోజుల క్రితం అపహరణకు గురైన స్వప్న అనే యువతి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. దీంతో బస్తీవాసులు అమ్మాయి ఆచూకీ కోసం సొంత ప్రయత్నం మొదలు పెట్టారు. మూడు రోజుల క్రితం స్వప్న ఉదయం వాకిలి ఊడుస్తుండగా కిడ్నాపునకు గురైంది. చెప్పు దెబ్బలు తిన్న ఆటో డ్రైవర్ స్వప్నను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
స్వప్న ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని బస్తీవాసులు ప్రకటించారు. అంతేకాకుండా నగరంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కిడ్నాపునకు సంబంధించి కొంత క్లూ దొరికిందని, హైటెక్ సిటీ వైపు ఉండే ఒక వ్యక్తి కిడ్నాపు చేశాడని ఒక వ్యక్తి చెప్పాడని, అది నిజమైతే అతనికి యాబై వేల రూపాయలు ఇస్తామని స్వప్న తండ్రి లక్ష్మీనారాయణ అంటున్నారు. స్వప్న ఆచూకీని త్వరలో తెలుసుకుంటామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications
