ఆర్మీ చీఫ్ పదవికి ముషార్రఫ్ వీడ్కోలు
రావల్పిండి: సైన్యాధ్యక్ష పదవికి పర్వేజ్ ముషార్రఫ్ బుధవారంనాడు రాజీనామా చేశారు. సైన్యాధ్యక్ష పదవిని తనకు సన్నిహితుడైన అస్ఫాక్ పర్వేజ్ కియానీకి అప్పగించారు. పాకిస్తాన్ సాయుధ శక్తులు ప్రపంచంలోనే ఉత్తమమైనవని, కియానీపై తనకు పూర్తి నమ్మకం ఉందని ముషార్రఫ్ ఈ సందర్భంగా అన్నారు. పాకిస్తాన్ ను కాపాడేవి సైనిక బలగాలేనని ఆయన అన్నారు. తన వారసుడు కియానీ మంచి సైనికుడని ఆయన అన్నారు.
తాను 18 ఏళ్ల వయసులో సైన్యంలో చేరానని, రెండు యుద్ధాల్లో పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. సైన్యాధ్యక్ష పదవిని వదులుకోవడం కొంత విచారం కలిగిస్తోందని ఆయన అన్నారు. రేపటి నుంచి తాను సైనిక దుస్తులు ధరించబోనని ఆయన చెప్పారు. 46 ఏళ్ల పాటు సైన్యంలో ఉండి ఇప్పుడు వీడ్కోలు పలుకుతున్నానని ఆయన అన్నారు. ముషార్రఫ్ రేపు పాకిస్తాన్ అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications
