రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్త్రీల మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా దుర్గి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా కూలీలే. దుర్గి గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనులు పూర్తి చేసుకుని రోడ్డుపై నడిచి వస్తుండగా వెనకి నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది.
దాంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా మరో మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
