రెండో భార్య నుంచే సుబ్బుకు ప్రాణహాని: సరసాదేవి
హైదరాబాద్: డిపెప్ కుంభకోణంలో సహ నిందితుడు సుబ్రహ్మణ్యంకు ఆయన రెండో భార్య స్వప్న నుంచే ప్రాణహాని ఉంటుందని సరసాదేవి అంటోంది. డిపెప్ కుంభకోణం డబ్బులన్నీ స్వప్న పేరు మీదనే ఉన్నాయని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు స్వప్న బాయ్ ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యంకు ప్రాణానికి హాని చేయవచ్చునని సరసాదేవి శుక్రవారం ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. స్వప్నను తన భార్యగా సుబ్రహ్మణ్యం తనకు పరిచయం చేశాడని ఆమె అన్నారు.
తన నుంచి సుబ్రహ్మణ్యంకు ఏ విధమైన ప్రాణహాని ఉండదని, ఈ మేరకు తాను హామీ ఇవ్వగలనని ఆమె అన్నారు. తమది అటువంటి మనస్తత్వం కూడా కాదని ఆమె చెప్పారు. సుబ్రహ్మణ్యం మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయ కార్యదర్శి సూరీడు, సరసాదేవిల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని సుబ్రహ్మణ్యం ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
