'సూర్య' పత్రిక ఉద్యోగిని దారుణ హత్య
హైదరాబాద్: నెల్లూరులో సూర్య దినపత్రికలో అకౌంటెంటుగా పనిచేస్తున్న రాధికారెడ్డి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంట్లో ఈ దారుణం జరిగింది. భర్తతో విడాకులు తీసుకుని ఆమె విడిగా ఉంటోంది. గొంతు కోసి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారనే కోణం నుంచి పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
శుక్రవారం ఉదయం కార్యాలయానికి రాకపోవడంతో ఆఫీసు బాయ్ ని ఆమె ఇంటికి పంపారు. దాంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కూతురు రాధిక నుంచి విడాకులు పొందిన భర్తది తమ ఊరేనని, అతని తండ్రి ఆమెను హత్య చేసి ఉంటాడని రాధికారెడ్డి తండ్రి చెప్తున్నాడు. అయితే రాధికారెడ్డి తల్లి వాదన మరో విధంగా ఉంది. ఇంతకు ముందు తమ కూతురు ఒక డిటిపి సెంటరులో పనిచేసేదని, ఆ సెంటర్ యజమాని తన కూతురికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన ఉదంతాలున్నాయని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications
