నాకూ సరసదేవి నుంచి ముప్పు: స్వప్న
హైదరాబాద్: తనకు, సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి సూరీడు నుంచి, డిపెప్ కుంభకోణంలో నిందితురాలు సరసాదేవి నుంచి ప్రాణహాని ఉందని సుబ్రహ్మణ్యం రెండో భార్య స్వప్న ఆందోళన వ్యక్తం చేశారు. సరసాదేవి వ్యవహరాలన్నీ తనకు తెలిసినందున్నే తనకు ప్రాణహాని తలపెట్టే ప్రమాదం ఉందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సరసాదేవి ఆరోపణల్లో నిజం లేదని ఆమె అన్నారు. డిపెప్ కుంభకోణం డబ్బు తన వద్ద లేదని ఆమె స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యంతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజమేనని, అయితే డిపెప్ కుంభకోణానికి చెందిన డబ్బుల్లో ఒక్కపైసా కూడా తన వద్ద లేదని ఆమె వివరించారు. డిపెప్ కుంభకోణం డబ్బులు తన వద్ద ఉన్నట్లు రుజువు చేస్తే ప్రభుత్వం వేసే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
