విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
విశాఖపట్నం: సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితిని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు శుక్రవారం తలపెట్టిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీచార్జీలో కొంత మంది విద్యార్థులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు 40 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న భాగ్యలత అనే విద్యార్థిని మృతితో హాస్టల్ సిబ్బందికి సంబంధం లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్యా నాయక్ చెప్పారు. భాగ్యలత ఇంటికి వెళ్లిన తర్వాతనే చనిపోయిందని ఆయన అన్నారు. హాస్టళ్ల మెరుగుకు 139 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
