కాంగ్రెస్ ఎంపీపీని కాల్చి చంపిన నక్సల్స్

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో మావోయిస్టులు ఈ ఉదయం ఆమనగల్ ఎంపీపీ పంతూ నాయక్ ను కాల్చి చంపారు. మైసిగండి గుడి వద్ద అతి సమీపం నుంచి నాయక్ ను కాల్చి చంపారు. ఆయన శివదీక్షలో ఉన్నారు. మైసిగండి దగ్గర జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు నక్సల్స్ పాల్గొన్నట్టు సమాచారం. కాల్పులు జరిపిన క్షణాల్లో ఆయన కుప్పకూలారు. ప్రదక్షిణ చేస్తుండగా ఈ కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం నక్సల్స్ ఒక లేఖను సంఘటనా స్థలంలో వదిలారు. అందులో తాము సిపిఐ మావోయిస్టు కార్యకర్తలమని రాసి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి సంతోష్ కిరణ్ పేరిట సంతకంతో ఈ లేఖ ఉంది. కాగా పంతూ నాయక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపి. ఈ ఘటనకు ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలం రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ పెద్ద యెత్తున జామ్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+