నీలోఫర్ లో మరణాలు సాధారణమే: సిఎం


హైదరాబాద్: నీలోఫర్ లాంటి ఆస్పత్రుల్లో మరణాలు సాధారణమేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైద్యుడిగా తనకు ఇది అనుభవమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నీలోఫర్ లో రొజుకు మూడు, నాలుగు మరణాలు సంభవిస్తాయని ఆయన చెప్పారు. చాలా సీరియస్ కండీషనులో నీలోఫర్ లాంటి ఆస్పత్రికి వస్తారని, దీని వల్ల మరణాలు సంభవిస్తాయని అన్నారు.

తమ ఆస్పత్రిలో మరణాలు సంభవించాలని ప్రైవేట్ ఆస్పత్రులు కోరుకోవని, దాంతో ఆ ఆస్పత్రులు కేసులను నీలోఫర్ లాంటి ఆస్పత్రులకు రెఫర్ చేస్తాయని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె వంటి సందర్భాల్లో మీడియా వార్తలు, ఫొటోల కోసం వాటిని ఎక్కువ ఎత్తి చూపడం పరిపాటేనని, ఇది మీడియాకు తప్పదు, తమకు తప్పదని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన అఫ్సర్ ఖాన్ పై పోలీసులు ఇప్పటికే కేసు పెట్టారని, దాన్ని పోలీసులే చూసుకుంటారని ఆయన అన్నారు. మజ్లీస్ శాసనసభ్యుడైనా, మరే శాసనసభ్యుడైనా పరిస్థితి అలాగే ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+