నీలోఫర్ లో 15 మంది పిల్లల మృతి
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె నేపధ్యంలో నీలోఫర్ ఆస్పత్రిలో సంభవించిన మరణాల సంఖ్య 15కు చేరుకుంది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో నీలోఫర్ ఆస్పత్రిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జూనియర్ డాక్టర్ల సమ్మెకు సీనియర్ డాక్టర్లు మద్దతు ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ వైద్యులు మంగళవారం విధులు బహిష్కరించారు.
నీలోఫర్ లో పరిస్థితి సజావుగానే ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చంద్రవదన్ అన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో మరణాలు సహజమేనని ఆయన అన్నారు.అత్యవసర సేవలకు విఘాతం కలగడం లేదని ఆయన అన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నుంచి వైద్యులను నీలోఫర్ కు పిలిపించినట్లు ఆయన తెలిపారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
