నీలోఫర్ అధికారులపై విజయశాంతి దాడి
హైదరాబాద్: తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి మంగళవారం నీలోఫర్ పిల్లల అస్పత్రి ఉన్నతాధికారులపై చేయి చేసుకున్నారు. పిల్లలకు వైద్యాన్ని అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఆస్పత్రి వద్ద ఊగిపోయారు. ఆస్పత్రి ఆర్.ఎం.ఒ.పై విజయశాంతి చేయిచేసుకున్నారని, సూపరిండెంటుపై దాడికి యత్నించారని వైద్యులు ఆరోపిస్తున్నారు. విజయశాంతి చర్యకు నిరసనగా వైద్యులు ఆందోళనకు దిగారు.
మృతి చెందిన చిన్నారిని ఎత్తుకుని విజయశాంతి వైద్యులపై కోపంతో ఊగిపోతూ ప్రసంగించారు. నీలోఫర్ ఆస్పత్రి ముందు ఆమె బైఠాయించారు. విజయశాంతి ఆస్పత్రికి చేరుకునే సరికి మృత శిశువును ఎత్తుకుని తల్లి, బంధువులు రోదిస్తున్నారు. వారిని ఆమె ఓదారుస్తూ మృత శిశువును ఆమె ఒళ్లో పెట్టుకుని వైద్యులపై తీవ్రంగా ప్రతిస్పందించారు. సమ్మెను విరమించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
