మీలో ఒక్కడిని, సమస్యలు తెలుసు: వైయస్
హైదరాబాద్: మీలో ఒక్కడిగా మీ సమస్యలు నాకు తెలుసు అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నీలోఫర్ పిల్లల ఆస్పత్రి జూనియర్ డాక్టర్లతో అన్నారు. తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ పై కేసు పెట్టాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. శాసనసభ్యుడిపై 307 కింద కేసు పెట్టడం ప్రభుత్వ పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు.
జూనియర్ డాక్టర్లను ఆయన చర్చలకు ఆహ్వానించారు. సమ్మె వల్ల నష్టపోయేది పేద ప్రజలేనని గుర్తించాలని ఆయన జూనియర్ డాక్టర్లకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు తగిన రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించారు.












Click it and Unblock the Notifications
