చిరు పార్టీ ఊహాజనితం: చంద్రబాబు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ స్థాపన అనేది ఊహాజనితమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అటువంటి ఊహాజనిత వార్తలపై తాను స్పందించబోనని ఆయన అన్నారు. ప్రభుత్వ వసతిగృహాల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం అందించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. హాస్టల్ పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 4 లక్షల దుప్పట్లు అందిస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇందుకు ముందుకు రావాల్సిందిగా ఆయన స్వచ్ఛంద సంస్థలను కోరారు. సహాయం అందించేవారి కోసం ఎన్టీఆర్ ట్రస్టులో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
హాస్టళ్లలో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం వల్లనే హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రచారానికి పెట్టే ఖర్చులో ఏ మాత్రం హాస్టళ్లకు ఇచ్చినా వసతులు సమకూరుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
