కమీషన్ విచారణకు అఫ్సర్ గైర్హాజర్
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిపై దాడి ఘటనకు సంబంధించి మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ మానవ హక్కుల కమీషన్ ముందు శుక్రవారం హాజరు కాలేదు. నోటీసులు అందకపోవడం వల్లనే అఫ్సర్ ఖాన్ హాజరు కాలేదని కమీషన్ వివరణ ఇచ్చింది. నీలోఫర్ ఘటనపై మానవ హక్కుల కమీషన్ శుక్రవారం విచారణను ప్రారంభించింది. నీలోఫర్ ఎంఆర్వో ఉషారాణి, జూనియర్ డాక్టర్లు కమీషన్ ముందు హాజరయ్యారు. అఫ్సర్ ఖాన్ అనుచితంగా ప్రవర్తించారని, తమను దుర్భాషలాడారని ఉషారాణి తన వాంగ్మూలంలో ఆరోపించారు.
నీలోఫర్ ఘటనలో అఫ్సర్ ఖాన్ ది, పోలీసులది తప్పేనని కమీషన్ అభిప్రాయపడింది. రేపటి నుంచి విధులకు హాజరు కావాలని కమీషన్ జూనియర్ డాక్టర్లకు సూచించింది. తమ అధికారాన్ని తక్కువగా అంచనా వేయవద్దని, విధులకు హాజరు కాకపోతే భారత వైద్య మండలి (ఎంసిఐ)కి సూచించి సర్టిఫికెట్లను రద్దు చేయిస్తామని కమీషన్ హెచ్చరించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ విధానాన్ని రద్దు చేయాలని కమీషన్ సూచించింది. అస్పత్రుల్లో ప్రత్యేక రక్షణ కల్పించాలని కూడా సూచించింది.












Click it and Unblock the Notifications
