తెరాస అభివృద్ధిని అడ్డుకుంటోంది: గీతారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అడ్డుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి జె. గీతారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా గజ్వెల్ వద్ద ఇండిస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు జరుగుతున్న భూసేకరణను తెరాస, బిజెపిలు ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
భూసేకరణ సందర్భంగా తమ భూములను ఇవ్వడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని, అటువంటప్పుడు తెరాస, బిజెపి అడ్డుకోవడం సరికాదని ఆమె అన్నారు. నందిగ్రామ్ పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కాదని, రైతులు అంగీకరిస్తేనే భూములను సేకరిస్తున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
