మోడీ వ్యాఖ్యలపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్‌పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా పరిశీలించనుంది. మోడీ వ్యాఖ్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. విచరాణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ గురించి మోడీ చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని మృతుని సోదరుడు రాబుద్దిన్, జావేద్ అక్తర్‌లు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలుచేశారు.
నవంబర్ నాలుగున సూరత్‌లోని మంగ్రోల్‌లో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థించారు. అంతేకాకుండా సొహ్రాబుద్దీన్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. సొహ్రాబుద్దీన్ 2005 నవంబర్ 26న జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
