పవన్ కేసు: జనవరి 4కు వాయిదా


విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు విచారణను విశాఖపట్నం మొదటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు సమర్పించిన నివేదిక పరిశీలనకు కోర్టు విచారణను వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసుపై ఇటీవల పోలీసులు నివేదిక సమర్పించారు. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ నివేదికలో తెలియజేసినట్లు సమాచారం.

ఈ కేసులో పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భార్య నందిని తరఫు న్యాయవాది చెప్పారు. వారు పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలతో పాటు వారి కుటుంబానికి చెందిన 14 మందిపై నందిని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+