పోలీసు కస్టడీకి మావోయిస్టు సాగర్
ఒంగోలు: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్ అలియాస్ ప్రతాప్ అలియాస్ పాండురంగారెడ్డిని మూడు రోజుల పోలీసు కస్టడీకి ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. సాగర్ ను కడప జైలులో న్యాయవాదుల సమక్షంలో విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని సూచించింది. విచారణకు ముందు సాగర్ కు వైద్య పరీక్షలు చేయించాలని కూడా సూచించింది.చెన్నైలో అరెస్టయిన సాగర్ ను పోలీసులు గురువారం సాయంత్రం మార్కాపురం కోర్టులో హాజరు పరిచారు. సాగర్ ను రిమాండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో సాగర్ ను పోలీసులు కడప జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications
