తెలంగాణ పోరు వల్లే అరెస్టు: శ్రీశైలం భార్య
నెల్లూరు: తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నందుకే తన భర్తపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని జర్నలిస్టు పిట్టల శ్రీశైలం భార్య కృష్ణవేణి విమర్శించారు. ఆమెతో పాటు కొంత మంది మిత్రులు శుక్రవారంనాడు నెల్లూరు సబ్ జైలులో పిట్టల శ్రీశైలంను కలిశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణపై పోలీసులు ఆయనను ప్రకాశం జిల్లా కందుకూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తన భర్తకు మావోయిస్టులతో ఏ విధమైన సంబంధాలు లేవని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మావోయిస్టు నాయకుడిని ఇంటర్వ్యూ చేయడానికే శ్రీశైలం కందుకూరు వచ్చినట్లు ఆమె తెలిపారు. తన భర్తపై పోలీసులు గతంలో కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆమె ఆరోపించారు. తన భర్తపై కేసులు ఎత్తేయాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
