హాస్టల్ విద్యార్థులతో చంద్రబాబు భోజనం
ఆదిలాబాద్: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. చలితో, దోమలతో హాస్టల్ విద్యార్థులు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఆదివారం సంక్షేమ యాత్ర చేపట్టారు. బెల్లింపల్లి, తాండూరు హాస్టళ్లను సందర్శించి ఆయన విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాండూరులోని హాస్టళ్లో ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన రోడ్ షో నిర్వహించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ జ్వరపీడితులను ఆదుకునే విషయంలో లేదని ఆయన అన్నారు. బెల్లంపల్లిలో చంద్రబాబు కార్యక్రమం వార్త రాయడానికి వచ్చిన విలేకరులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఒక విలేకరిని సిఐ జనార్దన్ కాలితో తన్నారు. అనంతరం ఆయన క్షమాపణ చెప్పారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.












Click it and Unblock the Notifications
