చిరంజీవి పార్టీపై ఊహాగానాలకు తెర
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడిది. తన రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం తొలిసారిగా పెదవి విప్పారు. తన ప్రమేయం లేకుండానే తన రాజకీయ ప్రవేశంపై వార్తలొచ్చాయని చిరంజీవి ఒక ప్రకటనలో చెప్పారు. అయితే పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలకి ప్రజల నుంచి విశేష స్పందన రావడం తనను హత్తుకుందని చిరంజీవి అన్నారు.
ర్యాలీలు, సభలు నిర్వహించాలని తానెవరినీ ప్రోత్సహించలేదని చిరు స్పష్టం చేశారు. రాజకీయ ప్రవేశంపై తనంతట తాను ఓ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని అన్నారు. అభిమానాలను, శ్రేయోభిలాషులను సహనంతో వుండాలని కోరారు. తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడమని, సభలు పెట్టాలని తాను ఏ వ్యక్తినీ ఏ సంస్థనూ కోరలేదని, ఈ విషయంలో తన ప్రోత్సాహం లేదని చిరంజీవి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
