సోనియాకు ఎన్నికల కమిషన్ నోటీసు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కు ఎన్నికల కమీషన్ ఆదివారంనాడు నోటిసులు జారీ చేసింది. నరేంద్ర మోడీని మృత్యు బేహారిగా అభివర్ణించినందుకు సోనియాకు, మోడీని హిందూ తీవ్రవాదిగా పేర్కొన్నందుకు దిగ్విజయ్ కు ఇసి నోటీసులు ఇచ్చింది. మంగళవారం లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఇసి ఆ నాయకులను ఆదేశించింది.
బిజెపి ఫిర్యాదు చేయడంతో స్పందించి ఇసి ఆ నోటీసులు జారీ చేసింది. తమ ఒత్తిడికి తలొగ్గి ఇసి స్పందించిందని బిజెపి వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యను ఇసి తప్పు పట్టింది. తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
