ఉస్మానియా నుంచి 2 శవాలు మాయం
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ నుంచి ఆదివారం ఉదయం రెండు శవాలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని మార్చురీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ శవాలు ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మాయమయ్యాయి. దీంతో ఆగ్రహించిన మృతుల బంధువులు మార్చురీ సిబ్బందిపై దాడి చేశారు. దుండగులు మార్చురీ వెనక తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి మృతదేహాలను ఎత్తుకెళ్లారు.
శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రెండు మృత దేహాలను మార్చురీకి చేర్చారు. ఇందులో ఒక మృతదేహం హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ కు చెందిన అంజిరెడ్డిది. ముస్లింజంగ్ వద్ద పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ శవాలు మార్చురీ నుంచి మాయమైనవేనని వారు ధృవీకరిచారు.












Click it and Unblock the Notifications
