సాగర్ విచారణ: భారీ డంప్ స్వాధీనం
ఒంగోలు: మావోయిస్టు నాయకుడు సాగర్ అలియాస్ ప్రతాప్ అలియాస్ పాండురంగారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆదివారంనాడు భారీ డంప్ ను గుర్తించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చింతల చెంచుగూడెం వద్ద పోలీసులు ఆ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. డంప్ లో సాగర్ కు చెందిన ఎకె -47 రైఫిల్ తో పాటు రెండు మేగజైన్లను, 60 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
డంప్ లో భారీగా నగదును, నగలును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలును, 7.5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గుంటూరు జిల్లాలోని చైతన్య గ్రామీణ బ్యాంకు నుంచి, నల్లగొండ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మావోయిస్టులు ఆ నగలును, నగదును దొంగిలించినట్లు భావిస్తున్నారు. పోలీసులు సాగర్ ను తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications
