గల్ఫ్ బాధితుల సాయానికి ప్రణబ్ హామీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారంనాడు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీని కలిసి గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి సాయం అందించాల్సిందిగా కోరారు. గల్ఫ్ కు భారతీయులను పంపించే ఏజెన్సీలపై నిఘా పెంచుతామని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల కోసం రాష్ట్రం చేస్తున్న న్యాయపోరాటానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రణబ్ చెప్పినట్లు వైయస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రాష్ట్రానికి 60 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని అందించేందుకు సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాజీవ్ గ్రామీణ విద్యుదీకరణ పథకం అమలుకు 130 కోట్ల రూపాయలు అందిస్తామని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
